Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపదేశాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: బీవీ రాఘవులు

ఉపదేశాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: బీవీ రాఘవులు

వతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రజలకు ఉపశమనం కలిగే ఆలోచనలు చేయకుండా ఉపదేశాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు.

పొదుపు చర్యల వల్ల సంక్షోభం తగ్గిపోతున్నట్లు ఉపదేశాలు చేయడం వలన ప్రయోజనం ఉండదని అన్నారు. గురువారం అల్లూరి విజ్ఞానకేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.జగన్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడీ మాటలతో గ్యాస్, పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయని పరోక్షంగా మోడీ చెప్పారని అన్నారు. స్వాముల్లా ఉపదేశాలు ఇస్తే సమస్యలు పరిష్కారం కావని, రాజకీయ నాయకులు సమస్యల్ని పరిష్కరించేలా ఆలోచించాలన్నారు. భారాలు మోయాలి, లేకపోతే మీరే భారాలు భరించాలని మోడీ మాటల్లో వ్యక్తం అయిందని అన్నారు.

తమ తప్పిదాల వల్ల సృష్టించిన సమస్యలకు ప్రజలను బాధితులను చేయడం సరికాదన్నారు. బంగారం కొనొద్దని చెప్పే ముందు ఆ బంగారు పనులపై ఆధారపడి బతుకున్న కార్మిక కుటుంబాల గురించి ఆలోచించడం లేదన్నారు. ప్రకృతి వ్యవసాయం చేయాలని చెబుతున్న మోడీ దానివల్ల వచ్చే పర్యవసానాలు, ఆహార భద్రత వంటి పెరగబోయే సమస్యలను గుర్తించడం లేదన్నారు.భవిష్యత్ లో ఎరువులు సరఫరా చేయలేమని, చమురు, గ్యాస్ ధరలు పెరుగుతాయని హెచ్చరించేలా మోడీ మాటలు ఉన్నాయన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ కొరతకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడి బాధ్యత వహించాలన్నారు.ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, చమురు సరఫరాను అమెరికా దిగ్బంధించడంతో భారత్ తీవ్రంగా నష్టపోతుందని, అయినా మోడీ మాట్లాడకపోవడం విచారకరమన్నారు. ట్రంప్ కు మోడీ దాసోహమవడం మానేసి భారత్ గౌరవం పెరిగేలా వ్యవహరించాలన్నారు.విశ్వగురువులా కాకుండా మోడీ విశ్వ బానిసలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. దిగ్బంధనం ఎత్తివేయాలని అమెరికాను మోడీ హెచ్చరించి ఈ సమస్యకు పరిష్కారం చూడాలన్నారు. కాలు మొక్కే పని విడనాడి ప్రజల ప్రయోజనాలు కాపాడాలన్నారు.

నీట్ పరీక్ష పత్రాలు లీక్ అవ్వడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, నీట్ ను నిర్వహించే సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో లాభాలకోసం దుర్మార్గమైన తప్పుడు పద్ధతులకు ప్రైవేట్ విద్యాసంస్థలు పాల్పడుతున్నాయన్నారు. షాడో విద్యావ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. పరీక్ష రద్దు వల్ల నష్టపోయిన విద్యార్ధులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
వంద రోజుల్లో పంచ గ్రామాల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం సమస్య పరిష్కరించకుండా మరమ్మతులు, నిర్మాణాలు చేసుకోకుండా వేధించడం సరికాదన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana