Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉత్తరాఖండ్ అడవుల్లో మళ్లీ చెలరేగిన మంటలు

ఉత్తరాఖండ్ అడవుల్లో మళ్లీ చెలరేగిన మంటలు

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌ న్యూతెహ్రీ జిల్లా బుడోగి ప్రాంతానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. హెక్టార్‌ విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని తెహ్రీ డీఎఫ్‌ఓ కోకోరోజ్‌ చెప్పారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అటవీ ప్రాంతంలో నిప్పు పడేయొద్దని ప్రజలను కోరారు. ఎవరైనా వ్యక్తులు పట్టుబడితే చట్టపరమైన చర్యలు డీఎఫ్‌ హెచ్చరించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అటవీశాఖ పోలీస్‌ శాఖ సహాయం తీసుకుంటున్నట్లు చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana