Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉత్తరప్రదేశ్లో మండే ఎండలు

ఉత్తరప్రదేశ్లో మండే ఎండలు

దురోజుల్లోనే 8 వేల మందికి పైగా మృతిన్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో ఎండలు మండిపోయాయి. యుపిలో వీచిన తీవ్రమైన వడగా ల్పుకు, అత్యధిక ఉష్ణోగ్రత లకు కేవలం ఐదు రోజుల్లోనే 8,056 మంది మృతి చెందారని తాజాగా ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.

ఇక పొరుగునున్న బీహార్లో 3,615 మరణాలతో నమోదైన రెండవ రాష్ట్రంగా ఉంది. మధ్యప్రదేశ్: 2,964, రాజస్థాన్ 2,644 హీట్వేవ్ మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలకు కేవలం ఒక్కరోజులోనే 3,400 మంది మరణించారని పరిశోధకుల బృందం వెల్లడించింది. ఇక ఐదు రోజులపాటు కొనసాగిన వేడి గాలుల వల్ల ఐదురోజుల్లో 30 వేల మంది చనిపోయారు.

అయితే అత్యధిక మరణాలతో యుపి ప్రాణాంతక కేంద్రంగా నమోదు కావడం గమనార్హం. కాగా, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో 60 శాతం మరణాలు సంభవించాయి. ముఖ్యంగా యుపిలో ప్రయాగ్రాజ్, లక్నో, కాన్పూర్ నగర్, అజంగడ్, ఆగ్రా, బరేలీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐదు రోజుల్లో ఈ జిల్లాలో 180కి పైగా మరణాలు సంభవించాయి. అలాగే గుజరాత్ రాజధాని అహ్మదాబాద్, రాజస్థాన్ రాజధాని జైపూర్, సూరత్లలో కూడా వేడికి తట్టుకోలేక చాలా మంది మృతి చెందారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై.. వేలాది మంది మరణాలకు కారణమని ఈ అధ్యనం స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana