Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వానాకాలం వ్యవసాయ ప్రణాళికను ప్రకటించాలి

వానాకాలం వ్యవసాయ ప్రణాళికను ప్రకటించాలి

రైతు సంఘం సమావేశంలో సారంపల్లి, జూలకంటి, సాగర్నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

వానాకాలం సాగు ప్రణాళికను వెంటనే ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.

సాగర్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మే 24న రోహిణి కార్తె ప్రవేశించడం, ఆ తర్వాత రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించి వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. అయినా వ్యవసాయ శాఖ వ్యవసాయ ప్రణాళిక ప్రకటించకపోవడం శోచనీయ మన్నారు. 'నా భూమి నా ఇష్టమైన పంట' అనే విధంగా పత్తి, వరి వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక లేని ఉత్పత్తి వల్ల కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు, పప్పులు, వంటనూనెలు, మాంసం, చిరుధాన్యాల ఉప ఉత్పత్తులు దిగుమతులు చేసు కుంటున్నామన్నారు. ఉద్యావన పంటలను ప్రస్తుతం 12 లక్షల ఎకరాలలో వేస్తున్న వాటిని 25 లక్షల ఎకరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అభివృద్దిపై సమగ్ర మైన ప్రణాళిక లేదని విమర్శించారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం బ్యాంకుల లావాదేవీల్లో 40 శాతం వ్యవసాయ, అనుబంద రంగాలకు రుణాలివ్వాలనే నిబంధన ఉందన్నారు. ఎక్కడా అది అమలు కావడం లేదన్నారు. మార్కెట్కు వచ్చిన ధాన్యం వారాల తరబడి కొనకుండా కాలయాపన చేస్తోందన్నారు. గోనె సంచులు, లారీలు, హమాలీలు లేరని, గోదాముల అందుబాటు లేవన్న కారణంగా కొనుగోలు చేయడం లేదని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తా మంటూ మంత్రులు ప్రచారం చేస్తున్నా…ఆచరణలో అమలు జరగటం లేదన్నారు. మొక్క జొన్నలు కొనుగోలుకు 120 కేంద్రాలు తెరుస్తామని కేవలం 70 మాత్రమే తెరి చారని ఫలితంగా కొనుగోలు నత్తనడకగా ఉన్నా యన్నారు. రెండు రోజుల క్రితం 2026-27కు మద్ధతు ధరల నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చినప్పటికీ ఇవి నామమాత్రంగా అమలవుతున్నా యని విమర్శించారు. రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరారు. న కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు పి జంగారెడ్డి, అరిబండి ప్రసాద్ రావు, మూడ్ శోభన్, ఉడుత రవీందర్, బొంతు రాంబాబు, వీరేపల్లి వెంకటేశ్వర్లు, అన్నవరపు సత్యనారాయణ, కొక్కెరపాటి పుల్లయ్య, మల్లు నాగార్జున రెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మాటూరి బాలరాజు గౌడ్, చందు నాయక్, ఈసంపల్లి బాబు, రామ్ చందర్, ఎం శ్రీనివాస్,డి. బాల్రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.​

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana