Dailyhunt
వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తోట

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తోట

వతెలంగాణ-మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో ఆదివారం నాగమణి రాజు అప్ప కుమార్తె శ్రద్ధ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అదేవిధంగా పెండ్లి కుమార్తె కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాసు సాయిలు , స్థానిక సర్పంచ్ ఉష సంతోష్, ఉప సర్పంచ్ రమేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు గడ్డం లక్ష్మణ్, హనుమాన్లు స్వామి, సంగయ్యప్ప హనుమంత్, తదితరులతోపాటు పెద్ద ఎక్లార గ్రామ సర్పంచ్ మహేష్ కుమార్, వీరందరికీ శాలువలతో సన్మానించారు. పెళ్లికి హాజరై ఆశీర్వదించిన ఎమ్మెల్యేకు నాయకులకు నాగమణి రాజప్ప కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana