Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలి

వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలి

డిప్యూటీ డిఎండిహెచ్ఓ దేవేందర్నవతెలంగాణ - మల్హర్ రావు

వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని భూపాలపల్లి జిల్లా డిప్యూటీ వైద్యాధికారి,ఎన్సిడి పిఓ దేవేందర్ ఆదేశించారు.

మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది రోజువారీ హాజరు రిజిస్టర్,స్టాక్ రిజిస్టర్, పిఓ బుక్ తనిఖీ చేసి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ డే నిర్వహించి ఎన్.సి.డి కార్యక్రమంపై అవగాహన నిర్వహించారు. ఎన్సిడి స్క్రీనింగ్ ను సబ్ సెంటర్స్ వైస్ రివ్యూ చేసి తక్కువున్న సబ్ సెంటర్స్ పర్ఫామెన్స్ పెంచాలని ఆదేశించారు. అన్ని సబ్ సెంటర్స్ లో 30 సంవత్సరాలపై వారికి ఎన్సిడి స్క్రీనింగ్ చేసి వారిని ఎన్సిడి పోర్టల్ లో అప్లోడ్ చెయ్యాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి వినయ్ భాస్కర్,ఎన్సిడి టీమ్, హెల్త్ సూపర్వైజర్, హెల్త్ అసిస్టెన్స్, ఏఎన్ఎమ్స్, ఆశాలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana