హోం
వనస్థలిపురంలో వృద్ధురాలిపై మూకుమ్మడి దాడి
హైదరాబాద్: కుటుంబ వివాదాల నేపధ్యంలో ఇంట్లోకి వెళ్లి వృద్దురాలిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడిన ఘటన నగరంలోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో వృద్ధురాలు సహా ఇంట్లో ఇతర సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే... బాధితులదే తప్పు అంటూ పోలీసులు రివర్స్ కేసు పెట్టారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఈరోజు రాచకొండ కమిషనర్‌ను బాధితులు కలువనున్నారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana