Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరదలతో ఏపీ, తెలంగాణలో నష్టపోయిన వారికి ఎస్బీఐ సహాయం

వరదలతో ఏపీ, తెలంగాణలో నష్టపోయిన వారికి ఎస్బీఐ సహాయం

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాలకు ఎస్.బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదలు ఆస్తులు, రోడ్లు, వ్యాపారాలు, పంటలకు విస్తృతమైన నష్టాన్ని కలిగించాయి.
ఒక బాధ్యతాయుత బ్రాండ్‌గా ఎస్.బి.ఐ జనరల్ ముందుకొచ్చి వినియోగదారులను సంప్రదిస్తూ, ఇన్సూరెన్స్ క్లైములకు వీలైన నష్టాలు ఏనైనా ఉంటే తెలియజేయవలసిందిగా పేర్కొంది. వచ్చిన క్లైములను త్వరగా పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకుంది. మొత్తం మీద ఎస్.బి.ఐ.జి వద్ద ఈ ఎస్.ఎమ్.ఇలకు సంబంధించిన 120 ప్రాపర్టీ క్లైమ్స్ విచారించి సహాయక చర్యలతోపాటు వీరి వ్యాపారాలను మళ్లీ నిలదొక్కుకుని కొనసాగేందుకు సహాయం అందించామని పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana