Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరుసగా నాలుగో రోజూ.. చల్లారని పెట్రో మంట

వరుసగా నాలుగో రోజూ.. చల్లారని పెట్రో మంట

- లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజీల్‌పై 31 పైసలు బాదుడు
- మోడీ సర్కారుపై సామాన్యజనం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోధరల విషయం లో వాహనదారులు, సామాన్య ప్రజలపై మోడీ సర్కారు ఏమాత్రమూ కనికరం చూప డం లేదు. మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న చమురు ధరలు నాలుగో రోజూ పైకి ఎగబాకాయి. ప్రభుత్వ రంగ ఇంధన సంస్థల ధరల ప్రకారం.. లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజీల్‌పై 31 పైసలు పెరిగాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో అక్కడ పన్నులతో కలుపుకొని ధరలు ఆకాశాన్నంటాయి. దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 91.27కు, డీజీల్‌ రూ.81.73కి చేరింది. వాణిజ్యరాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ రూ.

97.61కు, డీజీల్‌ ధర రూ. 88.82 కు ఎగబాకింది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.15 కాగా, డీజీల్‌ ధర రూ. 86.65 కు పెరిగింది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.

91.41కి చేరగా, డీజీల్‌ ధర రూ. 84.57కు చేరింది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.86 కు, డీజీల్‌ రూ. 89.11కు చేరి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నది. దేశంలో ఒకవైపు కరోనా.. సామాన్య, పేద ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అదీ చాలదన్నట్లు చమురు ధరల పెరగడం, ఫలితంగా నిత్యవసరాల రేట్లు పెరగడం తమకు దినదిన గండంగా మారిందని దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఇంధన ధరలను అదుపులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana