Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వేగు చుక్క నీవయ్యా!

వేగు చుక్క నీవయ్యా!

అలగానిపాడులో జన్మించిఅనితర సాధ్యమైన మార్గం ఎంచుకొని
అమీర్ హైదర్ ఖాన్ పరిచయంతో
మహాత్తర మార్క్సిజంను చదివి
కమ్యూనిస్టు భావాలతో
ఉద్యమాలను నిర్మించి
పోరాటాలకు సారదై నడిపించి

ఊరురా విప్లవ పార్టీని స్ధాపించిన
కామ్రేడ్ సుందరయ్య
అందుకో మా అరుణాంజలి.
శ్రమ జీవుల కోసం
అరుణ పతాకాన్ని చేతపట్టి
వెట్టిని తరిమికొట్టి
దీనులందరిని కూడకట్టి
కూలి సంఘం పెట్టి
బడుగు జీవులకు
బ్రతుకు బాట చూపించిన
కామ్రేడ్ సుందరయ్య
అందుకో మా అరుణాంజలి
యువజన సంఘం పెట్టి
లక్ష గొంతులను ఒక్కటి చేసి
ఐక్య ఉద్యమాలతో
స్వాతంత్ర కాంక్ష రగిలించి
ఎర్రగాంధిగా పేరొంది
మహిళలందరిని ఏకం చేసి
పోరాడే జెండా చేతికిచ్చి
వెన్నుతట్టి అండగా నిలిచి
దండుగా కదిలించి
మగువల బ్రతుకుల్లో
వెలుగులకై తపించిన
కామ్రేడ్ సుందరయ్య
అందుకో మా అరుణాంజలి.
కుల మత కట్టుబాట్లులేని
నవ సమాజం రావాలని
వర్గ పోరాటాన్ని ముందుండి నడిప
తిరుగుబాటులను ఎదురించి
కష్టజీవులకు అండగా కడదాకా నిలిచిన
కామ్రేడ్ సుందరయ్య
అందుకో మా అరుణాంజలి
నైజాం రజకార్లు
దొరతొత్తుల దురాఘతాలను ధ్వంసించగ
గెరిల్లా దళాలను ముందుండి నడిపి
దుర్మార్గుల వెన్నులో చలిపుట్టించి
దున్నేవానికే భూమి నినాదంతో
వేలాది ఏకరాలను పేదలకు పంచినట్టి
వీరతెలంగాణ సాముధ రైతాంగ పోరాటం
దేశాన్నికే వేగుచుక్కగా నిలిపిన
కామ్రేడ్ సుందరయ్య
అందుకో మా అరుణాంజలి.
పార్లమెంట్ పదవైనా శాసనసభకైనా
సామాన్యుడి వాహనం సైకిల్ పైనే నీ పయనం
కష్టజీవుల హాక్కులకై సాగిన జీవనయానం
నీతి నిజాయితీలకే కాదు
నిరాడాంభతకే నీలువెత్తు రూపం
కామ్రేడ్ సుందరయ్య
అందుకో మా అరుణాంజలి
మహనీయుడా నీ త్యాగం అజరామరం
మరువలేము నీ ఆశయస్ఫూర్తిని…..మీమెప్పుడూ…
ఎర్రజెండా నీడలోన …
నీవు చూపిన మార్గంలోన…
నిరతం మా పయనం ….నీ 'విప్లవ పథం' లో….
నీ తలపులే మదినిండా నిలుపుకొని
ఉద్యమ దీక్షతో… పోరాట దక్షతతో….
నీవు చూపిన లక్ష్యం సాధించే వరకు
వీడబోము నీ ఆశయ మార్గం….. ఓ మార్గదర్శి….

- అనంతోజు మోహాన్ కృష్ణ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana