Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెండి దిగుమతులపై ఆంక్షలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

వెండి దిగుమతులపై ఆంక్షలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ : బంగారంపై ఇటీవల కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం శనివారం వెండి దిగుమతులపై అదనపు ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

మే 13న పసిడి లోహాలపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి ఏకంగా 15 శాతానికి పెంచిన ప్రభుత్వం.. ఈ సుంకాలను వెండిపైనా అమల్లోకి తెస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్టి) శనివారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా ఆంక్షల ప్రకారం.. విదేశాల నుండి వెండిని దిగుమతి చేసుకోవాలనుకునే వ్యాపారులు లేదా సంస్థలు ఇకపై కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక లైసెన్స్ లేదా అనుమతిని పొందడం తప్పనిసరి అవుతుంది. దేశంలో పెరుగుతున్న దిగుమతి ఖర్చులను అదుపు చేయడానికి, విదేశీ మారకద్రవ్య నిల్వలపై ఒత్తిడిని తగ్గించడానికి, వాణిజ్య లోటును అరికట్టడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana