Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెస్టిండీస్ మరోసారీ..!

వెస్టిండీస్ మరోసారీ..!

ప్రపంచకప్నకు అర్హత సాధించిన కరీబియన్లున్యూఢిల్లీ : ఐసీసీ వన్డే ప్రపంచకప్ను తొలిసారి ముద్దాడిన, ప్రపంచ క్రికెట్ను తొలిసారి శాసించిన అరివీర భయంకర వెస్టిండీస్ ఆధునిక క్రికెట్లో మాటలకు అందనంతగా దిగజారుతోంది.

రెండుసార్లు ప్రపంచకప్ చాంపియన్ వెస్టిండీస్ అర్హత సాధించలేక 2023 వరల్డ్కప్కు దూరమైన సంగతి తెలిసిందే. ఫలితంగా, 2025 చాంపియన్స్ ట్రోఫికి సైతం దూరమైంది. పేలవ ఆటతీరుతో 2013 తర్వాత చాంపియన్స్ ట్రోఫీకి వెస్టిండీస్ అర్హతే సాధించలేదు. 2023 వన్డే వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో ఐదో స్థానంలో నిలిచి ప్రధాన టోర్నమెంట్కు దూరమైన కరీబియన్లకు 2027లోనూ నిరాశ తప్పేలా లేదు!.

సుదీర్ఘ విరామం తర్వాత ఆఫ్రికాకు వస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్కప్లో వెస్టిండీస్ నేరుగా పోటీపడే అవకాశం కోల్పోయింది. సోమవారం బెల్ఫాస్ట్లో జరిగిన వన్డేలో ఐర్లాండ్పై విజయం సాధించిన అఫ్గనిస్తాన్ ఐసీసీ ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్థానం పదిలం చేసుకుంది. 2027 వన్డే వరల్డ్కప్కు ఆతిథ్య దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే మినహా టాప్-8 జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. దీంతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ర్టేలియా, రన్నరప్ భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్తో పాటు అఫ్గనిస్తాన్ నేరుగా గ్రూప్ దశ పోటీలకు చేరుకున్నాయి.

ర్యాంకింగ్స్ కటాఫ్ తేదిలోపు భారత్తో వెస్టిండీస్ వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సిరీస్లో కరీబియన్లు విజయం సాధించినా.. టాప్-8లోకి వచ్చే అవకాశం లేదు. దీంతో వెస్టిండీస్ మరోసారి క్వాలిఫయర్ టోర్నమెంట్లో ఆడక తప్పదు. క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో సత్తా చాటినా.. ర్యాంకింగ్స్లో 12, 13, 14 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిరీస్ ఆడాల్సి రావటంపై ఇటీవల స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana