Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విదేశీ ఉద్యోగార్థుల బాధ్యత టామ్కాందే

విదేశీ ఉద్యోగార్థుల బాధ్యత టామ్కాందే

పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు అన్నీ చూసుకోవాలిస్కిల్ యూనివర్సిటీల్లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి
ఏటీసీల్లో అప్గ్రేడ్ సిలబస్తో ఆధునిక కోర్సులకు ప్రాధాన్యం

అవసరమైన చోట్ల నర్సింగ్ కళాశాలల ఏర్పాటు
'శక్తి' శాఖ సమీక్షలో సీఎం ఏ రేవంత్ రెడ్డి


వస్తే వీసా గడువు పొడిగింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మార్పుతో పరిశోధన ఆధారిత, ఎక్కువ కాలం కొనసాగే డిగ్రీలు చదివే విద్యార్థులకు అనిశ్చితి ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే పట్టభద్రులైన తర్వాత కొంతకాలం అమెరికాలో ఉద్యోగ అనుభవం పొందే అవకాశాలు కూడా పరిమితమయ్యే ప్రమాదం ఉంది.
విదేశీ విద్యార్థుల వాటా ఐదు శాతం అమెరికాలో విదేశీ విద్యార్థులకు విద్య అందించడం కూడా ఒక రకమైన సేవల ఎగుమతేనని పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్కు చెందిన సీనియర్ పరిశోధకుడు మైఖేల్ ఎ. క్లెమెన్స్ తన అధ్యయనంలో పేర్కొన్నారు. అమెరికా సేవల ఎగుమతుల్లో దాదాపు ఐదు శాతం వాటా విదేశీ విద్యార్థుల నుంచే వస్తుందని ఆయన వివరించారు. కొత్త నిబంధనల కారణంగా విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గితే సేవల ఎగుమతులు దెబ్బతిని, అమెరికా వాణిజ్య లోటు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఆవిష్కరణలు, ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం
అంతకంటే పెద్ద సమస్య నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత అని ఆ అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) రంగాల్లో విదేశీ విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని క్లెమెన్స్ పేర్కొన్నారు. అమెరికాలో చదివి అక్కడే ఉద్యోగాల్లో చేరే విదేశీ విద్యార్థులు సాధారణ గ్రాడ్యుయేట్లతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా కొత్త పేటెంట్లు నమోదు చేస్తున్నారని తెలిపారు. అమెరికాలో నమోదయ్యే మొత్తం పేటెంట్లలో దాదాపు 10 శాతం వరకు విదేశీ విద్యార్థులే కారణమవుతున్నారని ఆ పరిశోధన పేర్కొంది. అలాగే అమెరికాలో జన్మించిన గ్రాడ్యుయేట్లతో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువగా స్టార్టప్ కంపెనీలను స్థాపిస్తున్నారని వెల్లడించింది. ఇటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులు తగ్గిపోతే అమెరికాలో ఆవిష్కరణలు, పరిశ్రమల అభివృద్ధి, ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం పడుతుందని అధ్యయనం హెచ్చరించింది.

భారీ మూల్యం తప్పదు
ఈ నష్టం విద్యా రంగానికే పరిమితం కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో రూపుదిద్దుకోలేని కొత్త ఉత్పత్తులు, అభివృద్ధి చెందని తయారీ సాంకేతికతలు, ప్రారంభం కాని స్టార్టప్ సంస్థలు, నమోదు కాని పేటెంట్లు, దేశంలో పుట్టుకు రాని కొత్త పరిశ్రమల రూపంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక మూల్యం చెల్లించాల్సి వస్తుందని అధ్యయనం హెచ్చరించింది. దీంతో విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు చివరికి అమెరికానే దెబ్బతీసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana