Sunday, 23 Jul, 5.24 am నవ తెలంగాణ

హైదరాబాద్
విద్యాకుసుమం..నిజాం కళాశాల

- 130 ఏండ్ల చరిత్ర
- విద్యా నిలయంగా విరాజిల్లుతోన్న కళాశాల
- 1887లో ఆరో అసఫ్‌జాహి నిజాం పాలనలో స్థాపన
- 2008, ఫిబ్రవరి 20న ఘనంగా |
-120 ఏండ్ల ఉత్సవాల నిర్వహణ
- సంబరాలను ప్రారంభించిన అప్పటి స్పీకర్‌ సురేష్‌రెడ్డి
- ప్యాలెస్‌ పేరు మీదనే ఆ ప్రాంతానికి బషీర్‌బాగ్‌
- 1872లో సాలార్జంగ్‌ ఆలోచన మేరకు..
- మొదటి ఇంగ్లీషుగా స్కూల్‌ హైదరాబాద్‌ పాఠశాల
- మొదటి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అఘోరనాథ్‌ ఛటోపాధ్యాయ
రాజధానిలో సాలార్జంగ్‌ గొప్పతనానికి, పాయిగాల కళాదృష్టికి నిదర్శనంగా 130 ఏండ్ల చరిత్రతో నిజాం కళాశాల విరాజిల్లుతోంది. కళాశాలను 1887లో ఆరో అసఫ్‌జాహి నిజాం స్థాపించారు. అప్పటి నుంచి నేటివరకు చెక్కుచెదరలేదు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఎందరో ప్రముఖలను అందించిన ఘనత కళాశాలకు దక్కింది. మరెందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ తనదైన ముద్రను చెరిగిపోకుండా ముందుకుసాగుతోంది.
నవతెలంగాణ - సిటీబ్యూరో

నగరంలో ప్రముఖ ఉన్నత విద్యాసంస్థగా నిజాం కళాశాల చరిత్రకెక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయం. నిజాం కళాశాల 1887లో ఆరో అసఫ్‌జాహి నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ పాలనలో స్థాపించబడింది. ఇది హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రాంతంలో ఉన్నది. నిజాం కళాశాల 120 ఏండ్లు పూర్తిచే సుకున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహిం చుకుంది. ఏడాది పొడవునా జరిగిన ఈ ఉత్స వాలకు 2008, ఫిబ్రవరి 20న కళాశాల పూర్వ విద్యార్థి అయిన అప్పటి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ సురేష్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభం చేశారు. మూడురోజుల పాటు జరిగిన ఆరం భోత్సవాలలో అనేకమంది ప్రముఖ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అయితే నిజాం కళా శాల గురించి చెప్పుకోవాలంటే ముందుగా బషీర్‌బాగ్‌ ప్యాలెస్‌ చరిత్ర తెలుసుకోవాలి. ప్రస్తుతం నిజాం కళాశాల ఉన్న ప్రాంతంలో ఈ ప్యాలెస్‌ ఉండేది. కళాశాల కూడా ప్యాలెస్‌లో భాగంగానే ఉంది. అందువల్ల ప్యాలెస్‌ గురించి తెలుసుకుంటే..కళాశాల చరిత్ర ఇట్టే అర్థం అవుతుంది.
హైదరాబాద్‌ అంటేనే ప్యాలెస్‌ల నగరం. అందులో ఒకటైన బషీర్‌బాగ్‌ ప్యాలెస్‌ను నిజాం దగ్గర ప్రధానిగా పనిచేసిన సర్‌ అస్‌మన్‌ జా కట్టించాడు. అస్‌మన్‌ జా పాయిగా ప్రముఖుడు. పాయిగాలంటే నిజాం తర్వాత నిజాం అంతటోళ్లు. గతంలో కూడా నవతెల ంగాణ పాయిగాల వంశ చరిత్ర, సమాధులపై ప్రత్యేక కథనాలు ప్రచురించిన విషయం తెలి సిందే. ఈ నేపథ్యంలోనే పాయిగాల గురించి ప్రముఖంగా చర్చించు కోవాల్సిన అవసరం లేదు. ఈ సంగతి పక్కనుంచితే... హైదరా బాద్‌లో ఎన్నో విద్యాసంస్థలకు నాంది పలికిన వారిలో ప్రముఖడు నమాద్‌ ఉల్‌ ముల్క్‌. ఇతను నిజాం కాలంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యు కేషన్‌గా పనిచేసేవాడు. అంతేకాదు ఈ కళాశాల బిల్డింగ్‌ను పాయిగా నవాబు ఉల్‌ ముల్క్‌ బహదూర్‌ సమ్మర్‌ ప్యాలెస్‌గా వాడుకు నేవాడు. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఈ కట్టడాన్ని స్వాతంత్య్రం అనంతరం కూల్చేశారు. ఈ ప్యాలెస్‌లోని అవశేష భవనమే ప్రస్తుతం నిజాం కళాశాల భవనం. ఈ ప్యాలెస్‌ పేరుమీదనే ఈ ఏరియాను బషీర్‌బాగ్‌ అనే పేరు వచ్చింది. నిజాం కళాశాలను 1887లో అప్పటి హైదరాబాద్‌ పాఠశాల (నోబుల్‌ స్కూలు) మదరసా- ఏ-అలియాను కలిపి నిజాం కళాశాలగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ స్కూలు 1872లో మొట్టమొదటి ఇంగ్లీషు స్కూలుగా షురూ అయింది. అప్పటి ప్రధాని సాలార్జంగ్‌ ఆలోచన మేరకు ఏర్పడింది. ఈ స్కూలును నిజాం కళాశాలలో విలీనం తర్వాత కళాశాల హాలుకు సాలార్జంగ్‌ హాలు అని పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం కళాశాలలో సాలార్జంగ్‌హాలును చూడొచ్చు. కళాశాల స్థాపకుడు, విద్యావేత్త నవాబ్‌ ఇమాదుల్‌ ముల్క్‌ నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన సరోజని నాయుడు తండ్రి అయిన డాక్టర్‌ అఘోరనాథ్‌ ఛటోపాధ్యాయను ఏరికోరి కళాశాల మొదటి ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఈయన తర్వాత దేశానికి స్వాతంత్య్రం వచ్చేంత వరకు బ్రిటీషు, ముస్లిం వాళ్లు ప్రిన్సిపాల్స్‌ అయ్యారు. మిగతాది వచ్చే సండే స్పెషల్‌ల్లో భాగంగా తెలుసుకుందాం.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top