Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థులకు భోజనం అందించడమే తపా ?

విద్యార్థులకు భోజనం అందించడమే తపా ?

ఫుడ్ వాలంటీర్ మహమ్మద్ జునైద్​సుర్జిత్ భవన్లో ఆయనకు పలువురి నాయకుల ఘనస్వాగతం

​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జంతర్ మంతర్ లో ఆందోళన చేసిన విద్యార్ధులకు భోజనం అందించడమే తప్పా?

అంటూ పోలీసుల వేధింపులు ఎదుర్కొన్న మహమ్మద్ జునైద్ అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థి ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులకు ఫుడ్ పంపిణీ చేసినందుకు పోలీసుల వేధింపులకు గురైన మహమ్మద్ జునైద్ శనివారం హెచ్కెఎస్ సుర్జిత్ భవన్కు చేరుకున్నారు. ఆయనకు సీపీఐం(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు ఆర్. అరుణ్కుమార్, రాజ్యసభ ఎంపీ వి.

శివదాసన్, ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ఐషి ఘోష్, రాష్ట్ర అధ్యక్షుడు సూరజ్ ఎలామన్, సహాయ కార్యదర్శి మెహినా ఫాతిమా, రాష్ట్ర కమిటీ సభ్యులు అనిల్ సేతుమాధవన్, సఖి జునైద్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సఫ్దర్ హష్మీపై సుధాన్షా దేశ్పాండే రచించిన 'హల్లా బోల్' అనే పుస్తకాన్ని జునైద్కు శివదాసన్, ఐషిలు అందజేశారు. ఈ సందర్భంగా మహ్మద్ జునైద్ మాట్లాడుతూ '' ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి విద్యార్థులకు ఆహారం అందిస్తున్నా. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఎటువంటి కారణం లేకుండా నన్ను, నా కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు.

రోజంతా జైలులో ఉంచారు. విద్యార్థులకు భోజనం అందించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు ప్రశ్నించారు. ఆ తర్వాత నా కళ్లకు గంతలు కట్టి ఉత్తరాఖండ్కు తీసుకెళ్లి విడుదల చేశారు. సుమారు ఆరు గంటల పాటు కళ్లకు గంతలతోనే నేను ప్రయాణించాల్సి వచ్చింది. పోలీసులు నన్ను అరెస్టు చేసిన సమయంలో కుక్క కాటుకు ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా'' అని జునైద్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana