Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విలాసాగర్ ఇటుక బట్టీపై తక్షణ చర్యలు తీసుకోవాలి

విలాసాగర్ ఇటుక బట్టీపై తక్షణ చర్యలు తీసుకోవాలి

సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ డివిజన్ ఇంచార్జీ ఆత్కూరి శ్రీకాంత్ డిమాండ్నవతెలంగాణ - కాటారం
కాటారం మండలం విలాసాగర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కాటారం డివిజన్ ఇంచార్జీ ఆత్కూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

గ్రామ ప్రజల ఆరోగ్యాలకు ముప్పుగా, పర్యావరణానికి హానికరంగా, భవిష్యత్ తరాలకు నష్టం కలిగించే విధంగా గ్రామంలోని నివాస గృహాలకు అత్యంత సమీపంలో ఇటుక బట్టీ నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటుక బట్టీ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కనీసం పర్యవేక్షణ కూడా చేపట్టకపోవడం వెనుక బ్రిక్స్ యాజమాన్యంతో అధికారుల కుమ్మక్కు ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. అధికారులు నిజంగా పరిశీలన చేసి ఉంటే ఈపాటికే చర్యలు తీసుకునే వారని అన్నారు.

ప్రజావాణిలో జేసీకి వినతిపత్రం అందజేసినా ఇప్పటివరకు స్పందన లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాల కంటే కొందరి లాభాలకే ప్రాధాన్యం ఇస్తూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుస్తున్న ఇటుక బట్టీని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రామ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana