Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వినియోగదారులపై రూ.30 లక్షల ఇంధన భారం

వినియోగదారులపై రూ.30 లక్షల ఇంధన భారం

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులపై ప్రభావంనవతెలంగాణ - మల్హర్ రావు
గ్యాస్ ధర గుదిబండగా మార గా, పెట్రోల్, డీజిల్ ధరలు గుబులు రేపుతున్నాయి.పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కేంద్రం ధరలు పెంచడంతో సామాన్యుడి బడ్జెట్ అందనంత ఎత్తుకు చేరుతోంది.

పెరిగిన ఇంధన ధరలతో మండల వినియోగదారులపై నెలకు రూ.30 లక్షల భారం పడుతోంది.

వాహనమెక్కాలంటే తడుముకోవాల్సిందే.
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.107.55 ఉండగా ఇటీవల పెరిగిన ధరతో 110.97కు చేరింది. డీజిల్ లీటరు ధర 5.95.78 పెరిగింది. మండలంలో ద్విచక్ర,ఆటో,ట్రాక్టర్లు,మ్యాజిక్ తదితర 18,176 వేల వాహనాలకు ఇంధన భారం తడిసిమోపెడవు తోంది.

నెలకు రూ.30 లక్షల భారం
పెట్రోల్, డీజిల్ ధరల మోతతో జిల్లాపై నెలకు రూ.30 లక్షల భారం పడుతోంది. మండలంలో మూడు పెట్రోల్ బంకులుండగా 18,176 వేల వరకు ద్విచక్ర, మూడు, నాలుగు చక్రాల వాహ నాలున్నాయని సమాచారం.రోజుకు పది వేల లీటర్లు పెట్రోల్ వినియోగమవుతుండగా నిత్యం రూ.లక్ష భారం పడుతుండగా నెలకు రూ.30 లక్షల భారం పడుతోంది.

అన్ని వర్గాలపై ప్రభావం
మండలంలో వరి కోతలు సాగుతుండగా ట్రాక్టర్లు, లారీల ద్వారా ధాన్యం రవాణా చేస్తుండగా రైతు లకు అదనపు భారం పడుతోంది. కూరగాయలతో పాటు వాణిజ్యరంగాలపై భారమే. మరో పక్షం రోజులైతే వానాకాలం సాగు ప్రారంభం కానుండ గా దుక్కులు దున్నడం, నారుమళ్లు దున్నడం ప్రారబించడంతో అందరిపై భారం పడుతోంది.ఇప్పటికే రవాణా రంగం కుదేలవుతోంది. గిట్టుబాటు కాకున్నా ఈఎంఐలు కట్టేం దుకైనా ట్రాక్టర్ నడపాల్సి వస్తోంది. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరతో రవాణా ఖర్చు మరింత పెం చాల్సి వస్తోంది. రైతుల ధాన్యం, మక్కలను మార్కెట్కు తరలించాలంటే ఇంతకుముందు దూరాన్ని బట్టి రూ.1500 తీసుకునేది. ఇప్పుడు రూ.1700 తీసుకోవాల్సి వస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana