Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వినూత్న కథతో 'హ్యాపీ జర్నీ'

వినూత్న కథతో 'హ్యాపీ జర్నీ'

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, మహిళల భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ జర్నీ'. ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ల పై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతుం డగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ సింగిల్, టీజర్తో భారీ అంచనాలను రేకెత్తించిన చిత్ర బృందం, ఇప్పుడు సీతాకోకలా సాంగ్ విడుదల చేసింది. శేఖర్ చంద్ర అందించిన స్వరాలు హార్ట్ టచ్చింగ్ ఉన్నాయి.

సురేష్ బానిసెట్టి రాసిన సాహిత్యం మీనింగ్ ఫుల్ గా వుంది. చిన్మయి శ్రీపాద వోకల్స్ మెస్మరైజింగ్ గా, మహిళలందరికీ తమకు ఎటువంటి బౌండరీలు లేవని గుర్తుచేసే ఈ పాట విన్నవెంటనే కనెక్ట్ అవుతుంది. పారిస్, మాంట్పెలియర్, ఇతర అందమైన యూరప్ ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, అద్భుతమైన విజువల్స్తో పాటు హృద యానికి దగ్గరైన భావోద్వేగాలను కూడా అందించ బోతోంది. కథ విదేశీ నేపథ్యంలో సాగినా అందులోని అనుబంధాలు, భావాలు ప్రతి ఒక్కరికీ దగ్గరగా అనిపించేలా ఉంటాయి. నటీనటుల సహజమైన నటన సినిమాకు మరింత బలం చేకూర్చాయి. ఈ సినిమాకి సహ నిర్మాత: తరుణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శైలేంద్ర కుమార్, సంగీతం: శేఖర్ చంద్ర, డీఓపీ : మణికందన్ సుబ్రమణియన్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana