Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీరపూర్ లో ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకలు

వీరపూర్ లో ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకలు

వతెలంగాణ - మల్హర్ రావుకాటారం మండలం వీరపూర్ గ్రామంలో శనివారం బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం వేద పండితులచే మంత్రోచ్ఛారణల నడుమ ప్రతిష్టాపించారు.

గ్రామ పెద్దల సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అగ్ని, ప్రతిష్టాపన, హోమం, బొడ్రాయి, ఊరేగింపు, అభిషేకం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగలి హారతితో ఊరేగింపుగా వెళ్లి గ్రామంలో ప్రతిష్టాపన చేసిన బొడ్రాయి దేవత మూర్తులకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామంలో సాంప్రదాయాలు, సాంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను, పరిరక్షించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఐక్యంగా కలిసి ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana