Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విషపు గుళికలు తిని నెమలి మృతి

విషపు గుళికలు తిని నెమలి మృతి

వతెలంగాణ-ఏర్గట్లనిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో విషపు గుళికలు తిని నెమలి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. వారి సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

చనిపోయిన నెమలికి పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ.. కళేబరాన్ని పూడ్చివేశామని, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. పరిశీలించినవారిలో.. గ్రామ కార్యదర్శి రాహుల్, జీపీవో భూమన్న, అటవీశాఖ అధికారి వరుణ్ తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana