Saturday, 18 Sep, 6.50 pm నవ తెలంగాణ

తెలంగాణ రౌండప్
విస్తృతంగా కరోనా వ్యాక్సినేషన్

- ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో శనివారం విస్తృతంగా కరోనా వ్యాక్సిన్ చేసినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 745 మందికి అదేవిధంగా పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 737 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం మీద రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కలిపి 1482 మందికి ఒక రోజు వ్యాక్సిన్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఇప్పటికే చిన్న పంచాయతీలో 90 శాతానికి కి పైగా వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. ముందు ముందు సర్వే ద్వారా వ్యాక్సినేషన్ చేసుకొని వారిని గుర్తించి వెంటనే 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ చేసుకొని వారిని వెంటనే గుర్తించి వారిలోనే భయాన్ని పారద్రోలి వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు వారికి అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ చేసేందుకు సహకరించేందుకు ప్రయత్నాలు చేసి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top