- రష్యన్ కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి
మాస్కో : అక్టోబర్ మహా విప్లవ సారథి, ఇరవయ్యో శతాబ్ది చరిత్ర గతినే మార్చేసిన మహోన్నత నేత వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాలు, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చాలని రష్యన్ కమ్యూనిస్టు పార్టీ కోరింది. లెనిన్ 151వ జయంతిని పురస్కరించుకుని రష్యన్ కమ్యూనిస్టు పార్టీ నేత మాక్సిం సూరేకిన్ ఈ మేరకు ఐక్యరాజ్య సమితికి, యునెస్కోకు విజ్ఞప్తి చేశారు. ''ఈ ప్రపంచంలో గొప్ప ఆలోచనాపరుల్లో ఒకరు. మెరుగైన భవిష్యత్ కోసం ప్రపంచ చరిత్ర గతినే మార్చివేసిన మహనీయుడు లెనిన్ అని ఆయన పేర్కొన్నారు. లెనిన్ కృషి ఫలితంగా ఇప్పటికీ 8 సోషలిస్టు దేశాలు వున్నాయి.

