Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూట్యూబ్ లోకి "అరేయ్ అపండ్రా " సినిమా

యూట్యూబ్ లోకి "అరేయ్ అపండ్రా " సినిమా

వతెలంగాణ హైదరాబాద్: క్రియేటివ్ దింగ్స్ గ్యాంగ్ బ్యానర్ పై అశోక్ నిమ్మల నిర్మాణంలో , తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ' అరేయ్ అపండ్రా'.

సుదర్శన్, భద్రం, సాయి కృష్ణ తల్లాడలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మే 15న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. థియేటర్లలో పర్వాలేదు అనిపించిన ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ టైమ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇదే అంశంపై దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ స్పందిస్తూ, 'త్వరలో ఒక ఓటిటిలో మా సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అందుకోసం ఇంకా సమయం పడుతుంది, ఈ గ్యాప్ లో ప్రేక్షకులకు వినోదం అందించాలి అని టాలీవుడ్ టైమ్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులకు ఉచితంగా అందిస్తున్నాం' అని తెలిపారు. ఈ సినిమాకి ఎస్.ఎస్ వెంకటేష్ సంగీతం అందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana