Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువ కార్మికులకు అందని కనీస వేతనాలు,సామాజిక భద్రతా సౌకర్యాలు

యువ కార్మికులకు అందని కనీస వేతనాలు,సామాజిక భద్రతా సౌకర్యాలు

క్కుల రక్ష‍ణకు
 సంఘటిత పోరాటమే ఆయుధం:
యంగ్ వర్కర్ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పి.శ్రీకాంత్ నల్లగొండలో యంగ్ వర్కర్స్ జిల్లా సదస్సు

​నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

సంఘటిత,అసంఘటిత రంగంలో పనిచేస్తున్న యువ కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ రక్షణ హక్కులు దక్కాలంటే సంఘటిత పోరాటాలే ప్రధాన ఆయుధమని తెలంగాణ యంగ్ వర్కర్స్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సీఐటీయూ జిల్లా కమిటీ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న యంగ్ వర్కర్స్ జిల్లా సదస్సు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీ నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పుప్పాల శ్రీకాంత్ మాట్లాడారు. ప్రయివేటీకరణ, కాంట్రాక్టీకరణ విధానాల కారణంగా యువ కార్మికులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న యువ కార్మికుల్లో అత్యధిక మందికి కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అందడం లేదన్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, పని గంటల పెంపు, తక్కువ వేతనాల వంటి సమస్యలపై యువత సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కార్మిక చట్టాలపై అవగాహన పెంపొందించుకొని హక్కుల సాధన కోసం ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి.సలీం మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి బలమైన కార్మిక ఉద్యమాల నిర్మాణం అవసరమని స్పష్టం చేశారు. నిరుద్యోగం, అస్థిర ఉద్యోగాలు యువత భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నాయని అన్నారు. కార్మిక సంఘాల్లో చేరి హక్కుల సాధన కోసం ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం జిల్లా స్టీరింగ్ కన్వీనింగ్ కమిటీని 15 మందితో ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్ గా చిన్నపాక లక్ష్మీనారాయణ, కో కన్వీనర్లుగా ఎం. రవినాయక్, భీమగాని గణేష్ తోపాటు మరో 12 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, భీమగాని గణేష్, బండారి మధు గంజి రాజేష్, ఏర్పుల శ్రావణ్, జి.కొండల్, టి.రాజు, పోగల శశిధర్, నరేష్ ,భాగ్యరాణి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana