Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువ నటుడు మృతి

యువ నటుడు మృతి

హైదరాబాద్ : కన్నడ యువ నటుడు సంచారి విజయ్ (38) సోమవారం మృతి చెందాడు. జూన్ 12వ తేది రాత్రి స్నేహితుడి ఇంటి నుంచి టూవీలర్‌పై తిరిగొస్తూ ఆయన ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలపాలయిన అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పరిస్తితి విషమించి బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు తెలిపారు. సంచారి విజయ్ 2011లో రంగప్ప హోగ్బిన్తా మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. రామ రామ రఘు రామ్ణ, దశవల్ణ, కిల్లింగ్ వీరప్పన్, సిపాయి వంటి పలు సినిమాల్లో ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. నాను అవనల్ల అవలు్ణ సినిమాకు గాను ఉత్తమనటుడిగా నేషనల్ అవార్డ్, కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డ్, బెస్ట్ యాక్టర్‌గా సౌత్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నారు.

ఇదిలా ఉండగా ఆయన అవయవాలను డొనేట్ చెయ్యనున్నట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana