Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువజన ఉద్యమాల వేగుచుక్క డివైఎఫ్ఐ

యువజన ఉద్యమాల వేగుచుక్క డివైఎఫ్ఐ

వతెలంగాణ - వనపర్తి : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ యువజన ఉద్యమాల వేగుచుక్కని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డికోపుల మహేష్ అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో డివైఎఫ్ఐ 2026 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో యువజన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఏకైక సంస్థ డివైఎఫ్ఐ అని ఆయన అన్నారు. దేశంలో రాష్ట్రంలో అతిపెద్ద యువజన సంఘంగా డివైఎఫ్ఐ అవతరించిందని ఆయన తెలిపారు.

1980 నవంబర్ 1న పంజాబ్ రాష్ట్రంలో లుధియానా ప్రాంతంలో ఏర్పడిన డివైఎఫ్ఐ స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహనీయుల ఆశయాలతో ముందుకు నడుస్తూ దేశ ప్రగతి కోసం పాటు పడుతుందని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న యువజనుల, నిరుద్యోగుల వ్యతిరేక విధానాల పైన అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. నిధులు నియామకాల కోసం ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం పాలకులు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా రాజీవ్ వికాసం పథకం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది యువత స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న రేపు జూన్ 2 నాటికి సంవత్సరం పూర్తి అవుతున్న పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆయన విమర్శించారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించే డివైఎఫ్ఐ సంఘంలో యువతి యువకులు పెద్ద ఎత్తున చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధుగం నరేష్, తేజ, వెంకటేష్, శ్రీకాంత్, రాము, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana