ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఈరోజు అమరావతిలో పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
కొత్త జిల్లా అధ్యక్షుల – పోలవరం: బుల్లికొండలు దొర, మార్కాపురం: పోశం వెంకటకృష్ణారావు, బాపట్ల: మువ్వల వెంకట రమణారావు, అన్నమయ్య: పులిరెడ్డి నరేంద్ర కుమార్‌రెడ్డి.
ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. జిల్లాల వారీగా బలమైన నాయకత్వాన్ని నిర్మించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొత్త అధ్యక్షులకు ఆయన దిశానిర్దేశం చేశారు

