Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలోని అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలోని అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NAVYA MEDIA 1 week ago

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ రాష్ట్రంలోని 19 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మరియు ఆర్జీయూకేటీ (RGUKT) లలో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

నోటిఫికేషన్ విడుదల తేదీ: మే 15, 2026, ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: మే 18, 2026 , దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 8, 2026, హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ: జూన్ 15, 2026

మొత్తం 1,523 పోస్టులలో 1,244 రెగ్యులర్ పోస్టులు కాగా, 279 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వారీగా వివరాలు:

అసిస్టెంట్ ప్రొఫెసర్: 1,020 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్: 334 పోస్టులు, ప్రొఫెసర్: 63 పోస్టులు, లెక్చరర్ (RGUKT): 104 పోస్టులు

ఖాళీలు ఉన్న ప్రముఖ వర్సిటీలు - ఆర్జీయూకేటీ : 311 పోస్టులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం - 246 పోస్టులు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం -125 పోస్టులు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం-103 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ (రాత పరీక్ష) మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

అయితే, ఒక పోస్టుకు 12 మంది కంటే ఎక్కువ మంది అర్హులు ఉన్నప్పుడు మాత్రమే ఈ రాత పరీక్ష ఉంటుంది.

అసోసియేట్ ప్రొఫెసర్ & ప్రొఫెసర్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం నిర్దేశిత అర్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఊరట: ఇప్పటికే యూనివర్సిటీల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి వారి సర్వీస్ ఆధారంగా అదనపు వెయిటేజీ ఇస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

అర్హులైన అభ్యర్థులు అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్స్ అయిన naipunyam.ap.gov.in లేదా apuniversitiesrecruitment.apcfss.in ద్వారా మే 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia