ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫలితాలను ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.
పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ నంబర్‌తో ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్ results.bse.ap.gov.in ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
అలాగే https://www.manabadi.co.in/ ద్వారా ఫలితాలను చూడొచ్చు. ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థుల కోసం మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు పొందే అవకాశం కల్పించిందని మంత్రి తెలిపారు.
అలాగే 'LEAP' మొబైల్ యాప్, డిజిలాకర్ యాప్‌తో కూడా ఫలితాలు పొందొచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 3415 పరీక్షా కేంద్రాల్లో టెన్త్ క్లాస్ పరీక్షలను నిర్వహించారు.
ఈ పరీక్షలకు సుమారు 6.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,22.074 , ప్రయివేట్‌గా పరీక్ష రాసిన వారు 18,842 మంది ఉన్నారు.

