Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్టీసీ ప్రైవేటీకరణ, టికెట్ రేట్లు పెరుగుతాయనే వార్తలను ఖండించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్

ఆర్టీసీ ప్రైవేటీకరణ, టికెట్ రేట్లు పెరుగుతాయనే వార్తలను ఖండించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్

NAVYA MEDIA 1 week ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రైవేటీకరణ మరియు డీజిల్ ధరల పెంపు కారణంగా బస్సు టికెట్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న వార్తలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పూర్తిగా ఖండించారు.

ఈ తరహా ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.గుంటూరులో నిర్వహించిన ఒక సమావేశంలో మంత్రి ఈ విషయాలపై స్పష్టతనిచ్చారు.

డీజిల్ ధరలు పెరిగినప్పటికీ, ప్రయాణికులపై అదనపు భారం మోపకుండా ఆర్టీసీ ఛార్జీలను ప్రస్తుతానికి పెంచే ఉద్దేశం లేదా ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని మంత్రి తేల్చిచెప్పారు.

ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, సంస్థను ప్రభుత్వ పరిధిలోనే మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు.

ఆర్టీసీ ప్రస్తుతం ఆర్థికంగా బలంగా ఉందంటూ, సంస్థకు దాదాపు రూ 30,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

సంస్థను ఆధునీకరించే చర్యల్లో భాగంగా త్వరలోనే 2,500 ఎలక్ట్రిక్ (EV) బస్సులు, అలాగే 500 సీఎన్జీ (CNG) బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ, సంస్థలో ఖాళీగా ఉన్న అవసరమైన ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia