Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అద్భుత నటుడు జగన్మోహన్ రెడ్డి: మంత్రి నారా లోకేష్

అద్భుత నటుడు జగన్మోహన్ రెడ్డి: మంత్రి నారా లోకేష్

NAVYA MEDIA 2 days ago

ద్భుత నటుడు జగన్మోహన్ రెడ్డి అని, మతాల మధ్య చిచ్చుకు కుట్ర పన్నారని, తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం, దత్తలూరు వద్ద ఏర్పాటుచేసిన వేదికలో జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ కష్టకాలంలో పసుపుజెండాకు అండగా నిలబడిన వ్యక్తి భూపేష్ రెడ్డి. మాటలు తక్కువైనా చేతలు ఎక్కువ. జమ్మలమడుగు జోష్ అదిరిపోయింది.

పౌరుషాల గడ్డ ఇది. పెన్నా నది నీళ్లలోనే తేడా ఉంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో మూడు సాగునీటి ప్రాజెక్టులు, నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గండికోటను, టీడీపీని ఎవరూ టచ్ చేయలేరు.

ఉమ్మడి కడప జిల్లా ఎప్పుడూ టీడీపీకి అండగా నిలిచింది. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నాం. కోటిమంది సభ్యులు టీడీపీ సొంతం.

బడుగు, బలహీనవర్గాలను ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2019-24 మధ్య అనేక ఇబ్బందులు పెట్టారు. కార్యకర్తలు తెగువ చూపారు. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారు.

జగన్ రెడ్డికి చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వొచ్చు. అద్భుత నటుడు జగన్మోహన్ రెడ్డి. సినిమాల్లో నటిస్తే ఆస్కార్ అవార్డ్ వస్తుంది. ఆస్తి కోసం సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశారు.

ఇంకో చెల్లి తండ్రిని చంపి అన్యాయం చేశారు. సొంత జిల్లా ప్రజలను మోసం చేశారు. సొంత బాబాయిని లేపేసి నెపం మనపై నెట్టారు. గుండెపోటు కాదది గొడ్డలిపోటు.

కోడికత్తి, గులకరాయి డ్రామా చూశాం. మొన్న కడప పట్టణంలో జరిగింది కూడా అదే కుట్ర. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు.

కార్యకర్తే అధినేత అనేది టీడీపీ సిద్ధాంతం. నాడు, నేడు ఎప్పూడూ పార్టీకి కార్యకర్తలు అండగా నిలిచారు. పనిచేసే వారిని గుర్తించేందుకే మై టీడీపీ యాప్ తీసుకువచ్చాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.

వృద్ధులకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15వేల పెన్షన్ అందిస్తున్నాం. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సుప్రయాణ సౌకర్యం కల్పించాం.

దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా రూ.15వేల ఆర్థికసాయం అందిస్తున్నాం.

16వేల ఉపాధ్యాయ పోస్టులు, 6వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. పది వేల ఉద్యోగాలకు సింగిల్ జాబ్ కేలండర్ విడుదల చేశాం.

చేసే పనులు చెప్పుకోవాలి. పార్టీలో సంస్కరణల కోసం నేను పోరాడాను. సమస్యలు ఏవైనా ఉంటే అంతర్గతంగా పోరాడాలి. అలిగి ఇంట్లో కూర్చోకూడదు. 2019-24 మధ్య కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులను తొలగిస్తున్నాం.

రప్పా, రప్పా అంటే భయపడేవారు ఎవరూ లేరిక్కడ. మీ నాయకుడిని, వారి తండ్రిని చూశాం. రప్పా, రప్పాకు ఎండ్ కార్డ్ వేసే బాధ్యత నాది. రెడ్ బుక్ అంటేనే భయపడుతున్నారు.

చివరకు ఎర్ర కారు చూసినా భయపడుతున్నారు. జగన్ రెడ్డిది బెంతాహై. మూడు రోజులు బెంగళూరు, మూడు రోజులు హైదరాబాద్, ఒకరోజు తాడేపల్లిలో ఉంటున్నారు.

ఆయనకు సీసీడీ(క్రెడిట్ చోరీ డిజార్డర్) ఉంది. వైసీపీ కుట్రల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

అనేక పరిశ్రమలు జమ్మలమడుగుకు వస్తున్నాయి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ ను 2029 నాటికి పూర్తిచేస్తాం. గండికోట నిర్వాసితులకు న్యాయం చేస్తాం.

కడప గడ్డపైనే మిషన్ రాయలసీమను ప్రకటించాం. లక్ష కోట్ల ఔట్ లే తో రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం. రాయలసీమలో కార్లు పరిగెత్తించాం. నేడు ఫైటర్ జెట్లు వస్తున్నాయి.

ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. నేతలు మానవ సంబంధాలు పెంచుకోవాలి.

నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలను కలుస్తున్నాం. కూటమి మధ్య చిచ్చుకు వైసీపీ యత్నిస్తోంది. అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు సింప్లిసిటీ కోరుకుంటున్నారు.

నేను రెండే కార్లను వినియోగిస్తున్నాను. నేతలు అహంకారం వీడాలి. జమ్మలమడుగుకు ఎంఎస్ఎంఈ కంపెనీలను తీసుకువస్తామని మంత్రి చెప్పారు.

అనంతరం కార్యకర్తలు, ప్రజలను కలిసి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎస్.సవిత, జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ సీహెచ్ భూపేష్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు ఎమ్.రామకృష్ణ, కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వైఎస్ జుబులిలా, జోనల్ కోఆర్డినేటర్ పి.శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia