Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతిలో క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు!

అమరావతిలో క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు!

NAVYA MEDIA 6 days ago

రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) పథకంలో భూములిచ్చిన రైతులకు కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్స్ పన్ను (మూలధన లాభాల పన్ను) మినహాయింపు గడువును 2031 మార్చి 31 వరకు పొడిగించింది.

2026 బడ్జెట్ (ఫైనాన్స్ యాక్ట్ 2026) ద్వారా కేంద్రం ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది.

2017 బడ్జెట్‌లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో భూములు ఇచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు ప్రకటించారు.

దాదాపు 32,000 ఎకరాలు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఇది పెద్ద ఊరట. ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 10(37A) చేర్చారు - ఇది 2015 నుండి వర్తిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం మారడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయింది. మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చింది.

ప్లాట్ల అభివృద్ధి పనులు పూర్తికాలేదు. రైతులు 1,631 రోజులు నిరంతరం ఆందోళన చేశారు. కనీసం 64 మంది రైతులు ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు.

పరిస్థితి సర్దుమణిగిన తర్వాత కేంద్రం రెండు ముఖ్యమైన చర్యలు తీసుకుంది. 1. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం 2026 - అమరావతిని ఏకైక శాశ్వత రాజధానిగా చట్టబద్ధంగా నిర్ధారించింది.

2. Finance Act 2026 - పన్ను మినహాయింపు గడువును 2031 మార్చి 31 వరకు పొడిగించింది. ఒప్పంద బాధ్యత నెరవేర్చారు.

2017లో ఇచ్చిన హామీ, అనేక అడ్డంకుల తర్వాత, 2026లో సంపూర్ణంగా చట్టరూపం దాల్చింది. రైతు నమ్మకం వృధా కాలేదు. ఇప్పటికే మొదట దశలో పూలింగుకు భూములు ఇచ్చిన / ఇప్పుడు కూడా ఇస్తున్న వారికి వర్తిస్తుందని సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia