Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను  అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

NAVYA MEDIA 2 weeks ago

రోజు ఉదయం ఇంటి వద్ద ఆయనను అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా మంత్రి వివేక్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్విన కేసులో ఇటీవలే ఆయన అరెస్టై తర్వాత విడుదలయ్యారు

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సింగరేణి సంస్థ ఆస్తులను ధ్వంసం చేయాలని, జీఎం కార్యాలయాలను తగలబెట్టాలని, అలాగే రైలు పట్టాలను కోసేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు “మిలిటెంట్ తరహా” పోరాటాలు, దాడులు చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను తగలబెట్టాలని, రైలు పట్టాలను కత్తిరించి రైల్ రోకోలు చేయాలని రెచ్చగొట్టారు. అవసరమైతే ఇందుకోసం నెల రోజులు జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడాలన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు (ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్), ప్రభుత్వ విప్‌లు బల్మూరు వెంకట్, అద్దంకి దయాకర్ అలాగే సింగరేణి సంస్థ ప్రతినిధులు డీజీపీకి, నాంపల్లి, అబిడ్స్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం (మే 30, 2026) ఉదయం ఆయనను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టుకు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia