Dailyhunt
దేశంలో మోగిన సెల్ ఫోన్ సైరన్

దేశంలో మోగిన సెల్ ఫోన్ సైరన్

NAVYA MEDIA 1 week ago

ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో పౌరులను తక్షణమే అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం దేశవ్యాప్తంగా ఒక కీలక వ్యవస్థను పరీక్షించింది.

విపత్తులు, భూకంపాలు, యుద్ధాల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కొత్త వ్యవస్థను సిద్ధం చేసిన కేంద్రం.

ఇందులో భాగంగా దేశంలోని పలువురి మొబైల్ ఫోన్లకు ఉదయం 11.46 నిమిషాలకు భారీ శబ్దంతో, వైబ్రేషన్‌తో కూడిన ఒక ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. దీంతో చాలామంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్’ పేరుతో రూపొందించిన ఈ వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికే ఈ పరీక్ష నిర్వహించారు.

సెల్‌ఫోన్ కంపెనీలతో కలిసి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అలర్ట్ సర్వీస్ రూపొందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia