ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న E20 ఇంధన (20% ఇథనాల్ కలిపిన పెట్రోల్) విధానంపై ప్రత్యక్ష పోరాటానికి దిగారు.
ఈ20 పెట్రోల్ వల్ల వాహనదారులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆరోపిస్తూ ఆయన దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించారు. పెట్రోల్ బంకుల్లో ఈ20 ఇంధనంతో పాటు స్వచ్ఛమైన పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలి. వినియోగదారులకు నచ్చిన దాన్ని ఎంచుకునే హక్కు (రైట్ టు చూజ్) కల్పించాలి.
వాహనాలకు నష్టం: 2023 కంటే ముందు తయారైన దాదాపు 30 కోట్ల పాత వాహనాల ఇంజిన్లు, ఫ్యూయల్ సిస్టమ్స్ ఈ20 ఇంధనం వల్ల దెబ్బతింటున్నాయి. అవి త్వరలోనే తుక్కు (Scrap) కింద మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మిశ్రమ ఇంధనం అయినందున ఈ20 పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. ఈ20 ఇంధనం వల్ల జరిగే నష్టంపై వాహన తయారీ సంస్థలు నోరు విప్పకుండా ఈడీ ), ఐటీ దాడుల భయంతో కేంద్రం బెదిరిస్తోందని ఆరోపించారు.

