Dailyhunt
ఎన్డీఏ సాధించిన విజయం శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంపైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది: సీఎం చంద్రబాబు

ఎన్డీఏ సాధించిన విజయం శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంపైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది: సీఎం చంద్రబాబు

NAVYA MEDIA 1 week ago

రోజు ఎన్డీఏ సాధించిన విజయం, గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంపైనా, వికసిత భారత్ కోసం ఆయనకున్న దార్శనికతపైనా ప్రజలకు ఉన్న నిరంతర, పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ స్ఫూర్తితో నడిచే ప్రజల ఆకాంక్షల సంగమంగా ఎన్డీఏను ఇది మరింత బలోపేతం చేస్తుంది.

ఈ ఫలితంతో వికసిత భారత్ దిశగా సాగే ప్రయాణం మరింత బలోపేతమైంది. అభివృద్ధి పట్ల ఎన్డీఏకున్న అచంచలమైన నిబద్ధతకు ప్రజల విశ్వాసం, మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది.

యువ భారతదేశం విశ్వసనీయతకు, అభివృద్ధికి, పౌరులతో నిజమైన అనుబంధానికి విలువ ఇస్తుందనే సందేశాన్ని ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా అందిస్తోంది.

ఈ చారిత్రాత్మక తీర్పునకు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయ కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ గారికి,

ఎన్డీఏ విజేతలందరికీ, అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అని చంద్రబాబు ట్వీట్ చేసారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia