ఆంధ్రప్రదేశ్
ఏపీ క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు.

ఏపీ క్యాబినెట్ సమావేశం సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశం పూర్తయ్యాక వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా క్యాబినెట్ లో జరిగిన అనేక అంశాలు ఆయన ప్రస్తావించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 289 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గుర్తించామన్న అయన పదివేల మందికి పైగా సహాయక శిబిరాలకు తరలించామని అన్నారు. 30 వేల హెక్టార్టలో వ్యవసాయ పంటలు, 1300 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం కలిగిందని ఆయన అన్నారు. శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 నగదు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. డిసెంబర్ 15 కల్లా పంట నష్టం అంచనాల రూపకల్పన, డిసెంబర్ 30 కల్లా పరిహారం చెల్లింపు ఉంటుందని అయన అన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేబినెట్‌లో చర్చ జరిగిందని ఈ సంధర్భంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు సెంటీమీటర్ కూడా తగ్గదని సీఎం జగన్ తేల్చి చెప్పారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. వాస్తవ డిజైన్‌ల ఆధారంగానే పోలవరం నిర్మాణం చేస్తున్నామని అయన పేర్కొన్నట్టు సంచారం. ఇక ఉద్యోగులు, పింఛన్‌దారుల డీఏ బకాయిల్ని చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని విడతల వారీగా 3 డీఏల చెల్లింపునకు ఆమోదం, 2021 జనవరి నుంచి వర్తించనుంది ఆయన అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్ నిర్ణయం. తీసుకుందని కరోనా సమయంలో జీతాలు, పింఛన్లలో విధించిన కోత డిసెంబర్, జనవరి నెలలో చెల్లించనున్నామని ఆయన అన్నారు. డిసెంబర్ 25న 30 లక్షల 60 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయనుంది ప్రభుత్వం. 175 నియోజకవర్గాల్లో డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని కోర్టు స్టేలు ఉన్న ప్రాంతాల్లో తర్వాతి దశలో ఇళ్ల పట్టాల పంపిణీకి నిర్ణయం తీసుకున్నామని అన్నారు.