Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీకి గ్లోబల్ పెట్టుబడుల జోరు: కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక అడుగులు!

ఏపీకి గ్లోబల్ పెట్టుబడుల జోరు: కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక అడుగులు!

NAVYA MEDIA 2 weeks ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా ముందంజలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్ (Busan) నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

 ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలను ఏపీ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలోని టాప్ 3హైలైట్స్ :

1. కుప్పంలో 'హ్వాసంగ్' ఫుట్‌వేర్ యూనిట్.. బూ యంగ్‌తో చర్చలు

పాదరక్షలు, ఆటోమోటివ్ కాంపొనెంట్స్ రంగంలో గ్లోబల్ లీడర్ అయిన హ్వాసంగ్ గ్రూప్ (Hwaseung Group) ఉన్నతస్థాయి బృందంతో మంత్రి భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఫుట్‌వేర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు వారు ముందుకు రావడం విశేషం.

దీనితో పాటు, ప్రముఖ మెటల్ హార్డ్‌వేర్ & షూ లేసెస్ తయారీ సంస్థ బూ యంగ్ గ్రూప్ (Boo Young Group) సీఈవో ర్యాన్ కాంగ్, బిజినెస్ స్ట్రాటజీ మేనేజర్ మిల్లీ రిచర్డ్‌సన్‌లతో సమావేశమై, ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. హ్యుందాయ్ మోబిస్, శాంసంగ్, అపాక్ట్ వంటి దిగ్గజాలతోనూ చర్చలు జరిపారు.

2. బుసాన్‌లో 'అపెక్స్ - కొరియా'ప్రారంభం

కొరియా పెట్టుబడిదారులకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య బలమైన వారధిని నిర్మించేందుకు ఏపీఈడీబీ (APEDB) ఆధ్వర్యంలో 'APEX - Korea' (Andhra Pradesh External Engagement - Korea) పేరిట ఇన్వెస్టర్ల సహాయక, అనుసంధాన విభాగాన్ని మంత్రి లోకేష్ బుసాన్‌లో ప్రారంభించారు. ఇది కొరియన్ కంపెనీలు ఏపీలో సులభంగా వ్యాపారాలు ప్రారంభించడానికి (Ease of Doing Business) ఎంతగానో దోహదపడుతుంది.

3. మారిటైమ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్

కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ (KOMEA) నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి, ఏపీకి ఉన్న వ్యూహాత్మక బలాన్ని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పారు:

  • 1053 కి.మీ. సుదీర్ఘ తీరప్రాంతం.

  • 1 మేజర్, 5 నాన్-మేజర్ పోర్టుల ద్వారా ఏటా 330 మిలియన్ టన్నుల సరుకు రవాణా.

భారత తూర్పుతీరంలో మారిటైమ్ మరియు లాజిస్టిక్స్ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని ఆయన స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia