ప్రస్తుతం రాష్ట్రంలో ఎండ తీవ్రత మరియు వడగాలులు భారీగా పెరుగుతున్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వాతావరణశాఖ తెలిపింది.
తీవ్రమైన వాతావరణ పరిస్థితులు సూచన చేసిన వాతావరణశాఖ.
పలు జిల్లాల్లో ఎండలు 42 నుండి 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉంది. తీవ్ర వడగాలులు రేపు రాష్ట్రవ్యాప్తంగా 28 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయి.
మరో 21 మండలాల్లో కూడా వడగాలుల ప్రభావం ఉంటుంది. గాలిలో తేమ, ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురవుతారు. విదర్భ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
కర్నాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

