గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.
తన మధుర గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని, సంగీత ప్రపంచానికి స్వరాభిషేకం చేసిన ఆయన చిరస్మరణీయుడు.
తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన జీవించే ఉంటారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎప్పటికీ మన గుండెల్లో జీవించే ఉంటారు.
ఆ గాన గంధర్వుడికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నాను అని చంద్రబాబు పోస్ట్ చేసారు.

