Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్రాండ్ చెస్ టూర్‌ ఫైనల్స్-2026  టైటిల్ గెలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద

గ్రాండ్ చెస్ టూర్‌ ఫైనల్స్-2026 టైటిల్ గెలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద

NAVYA MEDIA 2 weeks ago

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్‌. ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ (GCT) ఫైనల్స్-2026 టైటిల్‌ను గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఈ ప్రతిష్టాత్మకమైన టైటిల్‌ను కైవసం చేసుకున్న మొట్టమొదటి భారతీయ ఆటగాడిగా ప్రజ్ఞానంద రికార్డు నెలకొల్పారు.

అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ 2 ఆటగాడు ఫాబియానో కరువానా (USA) పై ప్రజ్ఞానంద అద్భుతమైన విజయం సాధించారు.

క్లాసికల్ గేమ్‌ల ముగిసే సమయానికి ప్రజ్ఞానంద 3-9 స్కోరుతో ఏకంగా ఆరు పాయింట్ల భారీ లోటుతో వెనుకంజలో నిలిచారు.

చివరి రోజున అసాధారణ పోరాట పటిమ కనబరిచిన ప్రజ్ఞానంద, వరుసగా రెండు ర్యాపిడ్ గేముల్లోనూ కరువానాను ఓడించి ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత బ్లిట్జ్ విభాగంలోనూ అదే వేగాన్ని కొనసాగించారు.

చివరికి 15-13 తేడాతో కరువానాపై ఘన విజయం సాధించి టైటిల్‌ను ముద్దాడారు. ఈ చారిత్రాత్మక విజయంతో ఛాంపియన్‌గా నిలిచిన ప్రజ్ఞానందకు $200,000 (సుమారు రూ. 1.67 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia