Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ISIS ఉగ్రవాద సంస్థ గ్లోబల్ సెకండ్-ఇన్-కమాండ్ హతమైనట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన

ISIS ఉగ్రవాద సంస్థ గ్లోబల్ సెకండ్-ఇన్-కమాండ్ హతమైనట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన

NAVYA MEDIA 1 week ago

ISIS ఉగ్రవాద సంస్థ గ్లోబల్ సెకండ్-ఇన్-కమాండ్ అబు బిలాల్ అల్ మినూకిని అమెరికా-నైజీరియా దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఒక సంక్లిష్టమైన ఆపరేషన్‌లో విజయవంతంగా హతమార్చాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదిక ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన ఆదేశాల మేరకు యుఎస్ దళాలు, నైజీరియా సైన్యం కలిసి అత్యంత పక్కా ప్రణాళికతో ఈ వ్యూహాత్మక మిషన్‌ను పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఆఫ్రికాలో సురక్షితంగా దాక్కోవచ్చని అబు బిలాల్ భావించాడని, కానీ అమెరికా నిఘా వర్గాలు అతడి ప్రతి కదలికను గమనించి మట్టుబెట్టాయని ట్రంప్ పేర్కొన్నారు.

ఇకపై అతడు ఆఫ్రికా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయలేడని, అమెరికన్లను లక్ష్యంగా చేసుకునే ఉగ్ర దాడుల ప్రణాళికలకు చెక్ పడిందని స్పష్టం చేశారు.

ఆఫ్రికా వ్యాప్తంగా 12 దేశాలలో ఉగ్రవాద కార్యకలాపాలు, అంతర్జాతీయ నిధుల సమీకరణ, మరియు నెట్‌వర్కింగ్‌ను పర్యవేక్షించడంలో అల్ మినూకి కీలక పాత్ర పోషించాడు.

2023 లోనే అమెరికా ఇతనిపై ఆంక్షలు విధించి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఇతడి మరణంతో ఐసిస్ ప్రపంచవ్యాప్త ఆపరేషన్లు భారీగా బలహీనపడతాయని అంతర్జాతీయ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ ఉమ్మడి ఆపరేషన్‌లో భాగస్వామ్యం వహించినందుకు గాను నైజీరియా ప్రభుత్వానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia