కొత్తగా నిర్మిస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
రాష్ట్రంలో మున్సిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా చేసేలా ముందుకెళ్తున్నాం, ప్రస్తుతం విశాఖపట్నం,గుంటూరు లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు ఉన్నాయి కొత్తగా మరో 6 ప్లాంట్ లు నెలకొల్పుతున్నాం అని నారాయణ అన్నారు.
ఈలోగా మున్సిపాలిటీల్లో ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఈ ప్లాంట్ ల ద్వారా ప్రతి రోజు 5385 టన్నుల చెత్తను కంపోస్ట్,బయో గ్యాస్ గా మారుస్తాం అన్నారు.
గత చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసినా 150 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్ళిపోయింది.. గత ప్రభుత్వం వదిలేసిన చెత్తను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగిస్తున్నాం అన్నారు.
వచ్చే నెలాఖరునాటికి ప్లాంట్ లు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం అని మంత్రి నారాయణ తెలిపారు.

