తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు, కె. అన్నామలై తాము ఎన్నటికీ కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
తమ ' వె ది లీడర్స్' లక్ష్యాలు వేరని, CJP పార్టీ అజెండా పూర్తిగా వేరని, అందువల్ల వారికి తమ మద్దతు ఎప్పటికీ ఉండదని అన్నామలై క్లారిటీ ఇచ్చారు.
అయితే, CJP కి పొలిటికల్ సపోర్ట్ ఇవ్వకపోయినప్పటికీ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఏ పార్టీకైనా ఉంటుందని ఆయన సమర్థించారు.
ఢిల్లీ పోలీసుల నిర్బంధ చర్యలను, నిరసనకారులపై “దేశద్రోహులు” లేదా “ఫారిన్ ఏజెంట్లు” అని ముద్ర వేయడాన్ని ఆయన గతంలో తప్పుబట్టారు.
CJP నేతల అరెస్ట్‌లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని అన్నామలై విమర్శించడంతో, ఆయన సొంత పాత పార్టీ అయిన బీజేపీ నేతలు ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు.
దీనిపై స్పందిస్తూ, తనకు ఎవరూ దేశభక్తి గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నామలై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి పనులు చేస్తున్నారని ప్రశంసిస్తూనే, ఏదైనా తప్పు అనిపిస్తే ప్రధానిని ప్రశ్నించడానికి కూడా తాము వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
