తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సేవ సెంటర్ల ద్వారా అందించే పౌర సేవలపై వినియోగ ఛార్జీలు 50 శాతం పెంచింది. పెంచిన ఛార్జీలను ఏప్రిల్ 1 (బుధవారం) నుంచి అమల్లోకి తీసుకువచ్చింది.
ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణారావు ఇందుకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అందించే సర్వీసెస్‌పై 18 శాతం జీఎస్టీ విధించనుంది.
కేటగిరీ-ఏ విభాగంలో రూ.35 నుంచి రూ.62కి, బీ కేటగిరీలో రూ.45 నుంచి రూ.80కి పెంచింది. వాస్తవానికి 50 శాతం ఛార్జీలను పెంచినప్పటికీ జీఎస్టీ భారంతో కలిపి ఈ ఛార్జీల పెంపు 77-78 శాతం వరకు ఉండనున్నాయి.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో పౌర సేవల కోసం దరఖాస్తు చేసే వినియోగదారులపై కొంత ఆర్థిక భారం పడనుంది.

