లాలాపేటలో జరిగిన 'వాల్ రైటింగ్' కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు.
మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు దేశ ప్రజల నాడిని స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఉత్తర, దక్షిణ భారతదేశం అంటూ విభజన రాజకీయాలు చేసే వారికి తమిళనాడు ప్రజలు గట్టి సమాధానం చెప్పారని, ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తరహా మార్పు కనిపిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకమే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

