పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు 'పేదల సేవలో' కార్యక్రమంలో భాగంగా మత్య్సకారుల కుటుంబాలకు పింఛను పంపిణీ చేశారు.
'పేదల సేవలో' కార్యక్రమం కోసం వచ్చిన ఆయన, స్థానిక మత్స్యకారులతో మమేకమై వారి సమస్యలను, వారి కుటుంబ యోగక్షేమాలు, సంక్షేమ పథకాలు అందుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారి ఆప్యాయమైన ఆహ్వానం మేరకు మత్య్సకారులతో కలిసి కొద్ది సేపు బోటులో ప్రయాణించారు.

