నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ అన్నారు.
సోమవారం నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్ విలేకర్లతో మాట్లాడుతూ..
టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకే జిల్లాకు మొండిచేయి చూపించారని విమర్శించారు.
ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఈ జిల్లాలో టీపీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ తిరుగుతున్నారని ప్రశ్నించారు.
నిజామాబాద్‌కు అవుటర్ రింగ్ రోడ్ ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందూరు ప్రజలను మోసం చేస్తే వారే బుద్ధి చెబుతారన్నారు
దేవుళ్లను మోసం చేసిన వాడికి ప్రజలను మోసం చేయటం లెక్క కాదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ పేర్కొన్నారు.
2039 వరకు రాహుల్ ప్రధాని కారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. అంటే రాహుల్ ఇక ప్రధాని కాలేరని తెలంగాణ సీఎం చెప్పారు.
తద్వారా ఇంకో పదేళ్లు దేశంలో బీజేపీ ఉంటుందని తెలంగాణ సీఎం ఒప్పుకున్నారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి బదులు కోమటిరెడ్డి లాంటి జెన్యూన్ పర్సన్‌ని తెలంగాణ ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు ఎంపీ అరవింద్ సూచించారు.

