Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తో భేటీఅయిన సూపర్ స్టార్ రజనీకాంత్

నేడు డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తో భేటీఅయిన సూపర్ స్టార్ రజనీకాంత్

NAVYA MEDIA 2 weeks ago

నేడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని ఆల్వార్‌పేటలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

ఎన్నికల ఓటమి తర్వాత తన పాత మిత్రుడు స్టాలిన్‌ ను రజనీకాంత్ కలిశారు. ఇది కేవలం రాజకీయ కారణాలతో కాకుండా, వ్యక్తిగత అనుబంధంతో జరిగిన భేటీగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి కేవలం 59 సీట్లకు పరిమితమై అధికారానికి దూరమైంది. అనూహ్యంగా తన సొంత నియోజకవర్గం కొళత్తూర్‌లో స్టాలిన్, టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో సుమారు 8,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia