Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణస్వీకారం

నేడు కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణస్వీకారం

NAVYA MEDIA 6 days ago

కేరళ 13వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు.

తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో మే 18, 2026 సోమవారం ఉదయం జరిగిన ఘనమైన వేడుకలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) కూటమి ఘనవిజయం సాధించడంతో, పదేళ్ల తర్వాత కేరళలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.

ముఖ్యమంత్రి సతీశన్‌తో పాటు 20 మంది మంత్రులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ రాజకీయాల్లో దాదాపు 60 ఏళ్ల తర్వాత ఒకే విడతలో పూర్తి మంత్రిమండలి ప్రమాణం చేయడం ఇదే మొదటిసారి.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వీడీ సతీశన్, తన వద్దే ఆర్థిక (Finance) పోర్ట్‌ఫోలియోను కూడా ఉంచుకోనున్నారు.

ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ విచ్చేశారు.

తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు హాజరయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia